ఫేవరేట్ తెలుగు ఓటీటీ ఆహా..సబ్ స్క్రైబర్స్ ను ఆకర్షించేందుకు మరో ఎగ్జైటింగ్ ప్లాన్ అనౌన్స్ చేసింది. పాకెట్ ప్యాక్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో కేవలం 67 రూపాయలకే నెల సబ్ స్క్రిప్షన్ అందిస్తున్నారు. చవకైన ఈ ప్యాక్ ప్రేక్షకుల్ని టెంప్ట్ చేసేలా ఉంది.
మూవీస్, వెబ్ సిరీస్ లు, గేమ్ షోస్..ఇవన్నీ సబ్ స్క్రైబర్స్ నెలంతా ఈ చిన్న అమౌంట్ తోనే ఎంజాయ్ చేయొచ్చు. ఆహాలో హోమ్ టౌన్, త్రీ రోజెస్ సీజన్ 2, సరాక్ర్ సీజన్ 5, అప్సర వంటి క్రియేటివ్ కంటెంట్ సబ్ స్క్రైబర్స్ కోసం రెడీ అవుతోంది. మీ కోసం కావాల్సినంత క్రియేటివ్ తెలుగు, తమిళ రీజనల్ కంటెంట్ ఆహాలో అందుబాటులో ఉంది. ఉగాది సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ అట్రాక్టింగ్ పాకెట్ ప్యాక్ వల్ల ఆహాకు భారీగా సబ్ స్క్రైబర్స్ ను యాడ్ కానున్నారు.