సోషల్ మీడియా మాన్ స్టర్స్ కొందరుంటారు. వారికి సెలబ్రిటీలను బెదిరించడం అలవాటు. అలాంటి ఓ వ్యక్తి హీరోయిన్ నిధి అగర్వాల్ ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నిధితో పాటు ఆమె కుటుంబ సభ్యులను హెచ్చరిస్తూ కామెంట్స్ పంపుతున్నాడు. ఈ వ్యక్తిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది నిధి అగర్వాల్. సైబర్ క్రైమ్ లో అతనిపై ఫిర్యాదు చేసింది.
ఈ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. నిధి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది నిధి అగర్వాల్. ప్రభాస్ తో కలిసి రాజా సాబ్, పవన్ తో హరి హర వీరమల్లు చిత్రాాల్లో నటిస్తోంది.