తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడు వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదు అయ్యాయి. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో కస్తూరి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
తెలుగు వారు, తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది నటి కస్తూరి. ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమిళనాట తెలుగు సంఘాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాట కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిణామాలతో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పింది కస్తూరి. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.