కొన్నేళ్లగా ప్రేమలో ఉన్న హీరోయిన్ తమన్నా విజయ్ వర్మ రీసెంట్ గా బ్రేకప్ అయ్యారు. ప్రేమ నుంచి విడిపోయినట్లు చెప్పకనే చెబుతున్నారు. రిలేషన్ షిప్ నుంచి దూరమయ్యాక ఈ జంట వెల్లడిస్తున్న అభిప్రాయాలు అసలు ఎందుకు విడిపోయారో స్పష్టం చేస్తున్నాయి. తమ లవ్ బ్రేకప్ గురించి విజయ్ వర్మ రీసెంట్ గా మాట్లాడారు.
ప్రేమను బిజినెస్ గా చూడనంత వరకు బాగుంటుందని, దాన్ని ప్యూర్ గానే ఉంచాలని అన్నాడు. విజయ్ వర్మ చెప్పిన మాటలతో ప్రేమను బిజినెస్ గా చూసింది ఎవరు. తమన్నానే అలా వ్యవహరించిందా అనే టాక్ నెట్టింట మొదలైంది. లవ్ లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే సంతోషంగా ఉన్నానంటూ చెప్పాడు విజయ్ వర్మ. ఈ మాటలపై తమన్నా ఏమంటుందో చూడాలి. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటించిన తమన్నా, విజయ్ వర్మ లవ్ చేసుకున్నారు.