హీరోయిన్ తమన్నా(Thamanna bhatia), నటుడు విజయ్ వర్మ(Vijay varma) రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎయిర్ పోర్ట్ లలో, బీచ్ ల దగ్గర, ఇతర వెకేషన్ స్పాట్స్ లో ఎన్నోసార్లు కలిసి కనిపించారు. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి తమన్నా, విజయ్ వర్మ ఓపెన్ గానే మాట్లాడుతుంటారు.
రీసెంట్ గా ఇదే విషయంపై స్పందించారు విజయ్ వర్మ. తమన్నా, తాను కలిసి ఎన్నో సందర్భాల్లో కలిసే ఉన్నామని, తమన్నాతో తాను తీసుకున్న ఫొటోస్ కనీసం 5 వేల వరకు తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం తనకు ఇష్టం లేదని విజయ్ వర్మ చెప్పాడు. అవి మా పర్సనల్ ఫొటోస్ మాత్రమే. వాటిని అందరికీ చూపించాలని అనుకోవడం లేదని విజయ్ వర్మ అన్నాడు.