‘హోం టౌన్’ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూస్తుంటే తానూ పిల్లాడిని అయిపోయానని, 35 ఏళ్లు వెనక్కు వెళ్లిన ఫీల్ కలిగిందని అన్నారు యాక్టర్ రాజీవ్ కనకాల. ఆయన ముఖ్య పాత్రలో నటించిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ రేపటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలుగా వ్యవహరించగా..శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఈరోజు మీడియా ఫ్రెండ్స్ కోసం ‘హోం టౌన్’ స్పెషల్ ప్రివ్యూ షో వేశారు.
ఈ ప్రివ్యూ షో చూసిన వారంతా ఎమోషనల్ గా ఫీలయ్యారు. ప్రతి ఎపిసోడ్ ను ఎంజాయ్ చేశారు. చివరకు ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ను అలాగే ఉంచుతూ చివరి ఎపిసోడ్ ను ప్రివ్యూ వేయలేదు. అసలైన ట్విస్ట్స్ ఉండే ఆ లాస్ట్ ఎపిసోడ్ ఆహాలోనే చూడాలి. ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల స్పీచ్ ఆకట్టుకుంది. ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో ప్రజ్వల్, సాయిరామ్, అనిరుధ్ చేసిన అల్లరి చూస్తుంటే తన స్కూల్ డేస్ గుర్తొచ్చాయని ఆయన అన్నారు. నవీన్ మేడారం నిర్మించిన 90’s A middle class biopic వెబ్ సిరీస్ లాగే ‘హోం టౌన్’ కూడా పెద్ద సక్సెస్ అవుతుందనే హైప్ ఏర్పడుతోంది.