అభిమాన సంఘాలతో జగ్గుభాయ్ కటీఫ్

జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు విలన్ గా అంతకంటే ఎక్కువ పేరు, డబ్బు సంపాదిస్తున్నాడు. సౌత్ కే కాకుండా హిందీలోనూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. జగ్గుభాయ్ తాజాగా ఓ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే..ఇకపై తనకు తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు.

ఎన్నో ఏళ్లుగా అభిమానులను తనను ప్రేమిస్తున్నారని, వారికి కష్టం వచ్చినప్పుడు తాను ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తాజా ప్రకటనలో జగపతి తెలిపారు. అయితే ఇటీవల ఫ్యాన్స్ పేరు చెప్పుకుని ప్రేమించడం కన్నా, ఆశించడం ఎక్కువైందని, ఇలా ఇబ్బంది పెడుతున్న అభిమాన సంఘాల నుంచి తప్పుకుంటున్నట్లు జగ్గుభాయ్ పేర్కొన్నాడు. అభిమాలతో తన అనుబంధం మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుందని జగపతి బాబు చెప్పాడు.