బలగం చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న జానపద కళాకారుడు, నటుడు బలగం మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ, గుండె సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. మొగిలయ్యకు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థికంగా సాయం చేశారు.
అలాగే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో ఈ రోజు వరంగల్ లో కన్నుమూశారు. బలగం మొగిలయ్య మృతికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.