కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా డెవిల్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి సీక్రెట్ ఏజెంట్ కథతో అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే డెవిల్ సినిమా నుంచి దర్శకుడు నవీన్ మేడారంను నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ తొలగించినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల నవీన్ మేడారంను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల దగ్గరకు కూడా రానివ్వడం లేదట.
ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అభిషేక్ నామా అని వేసుకున్నారు. విషయం ఏంటని తెలుసుకుంటే దర్శకుడిగా మార్చారని వెల్లడైంది. సినిమా కోసం ఇన్నేళ్లు కష్టపడిన దర్శకుడిని మార్చడం సరికాదనే విమర్శలు అభిషేక్ పిక్చర్స్ పై వినిపిస్తున్నాయి.