“మ్యాడ్ స్క్వేర్” కు “ఆయ్” అడ్వాంటేజ్

నార్నే నితిన్(Narne nitin), సంగీత్ శోభన్(Sangeeth shoban), రామ్ నితిన్(Ram nitin) హీరోలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన సినిమా మ్యాడ్. గతంలో రిలీజైన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడిదే ఉత్సాహంలో మ్యాడ్ మూవీ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్(MAD square) ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే కలెక్షన్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆయ్ సక్సెస్ మ్యాడ్ స్క్వేర్ కు మంచి అడ్వాంటేజ్ కాబోతోంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది. కల్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.