బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. ఎన్నో సార్లు అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం గురించి మాట్లాడడం జరిగింది. అయితే.. డైరెక్టర్ రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం అని చెప్పారు. రాజమౌళి మహా భారతం తీయాలి అనుకున్న తర్వాత అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేసారని వార్తలు వచ్చాయి. అమీర్ లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అవ్వడంతో ఈమధ్య కాలంలో తన నటించే కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే.. ఇప్పుడు అమీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
రీసెంట్ గా అమీర్ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషేష్ తెలియచేశారు. ఈ సందర్భంగా అమీర్ స్పందించాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహా భారతం ప్రాజెక్ట్ కు సంబంధించి వర్క్ స్టార్ట్ అయ్యిందని.. దీనికి సంబంధించి కొంత మందిని అపాయింట్ చేయడం కూడా జరిగిందని తెలియచేశారు. అమీర్ ఇలా చెప్పినప్పటి నుంచి ఈ మహాభారతం ను ఎన్ని పార్లులుగా తీయనున్నారు..? ఎవరు డైరెక్ట్ చేయనున్నారు..? ఎవరెవరు నటించనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది.