విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ రిలీజైంది. యాక్షన్, ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ లతో ట్రైలర్ నింపేశారు. యువ రాజకీయ నాయకుడు లంకల రత్నాకర్ ఎలక్షన్స్ గెలిచేందుకు చేసిన పనులేంటో చూపిస్తూ వాటిని కాంటెంపరరీ రాజకీయాలతో పోల్చే ప్రయత్నం చేశారు దర్శకుడు కృష్ణ చైతన్య. ఈ కథలో అంజలి, నేహా శెట్టికి ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈ నెల 31న రిలీజ్ కు వస్తోంది.
ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఓటర్లకు డబ్బు మందు పంచిన లంకల రత్నాకర్ పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బులతో దొరికిపోతాడు. పోలీసులు అరెస్ట్ కు రంగం సిద్దం చేస్తారు. పోలీసుల నుంచి తప్పించుకున్న రత్నాకర్ వారితో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడతాడు. ఇంతలో ప్రత్యర్థులు కూడా పోలీసులతో కలిసి ఓ చేయి అందిస్తారు. ఈ పరిస్థితిలో యుద్ధానికి సిద్ధమవుతాడు హీరో. తాను ఆడిన ఈ రాజకీయ ఆటలో సాధించిందేంటి, ఎన్నికల్లో గెలుపు అందుకున్నాడా లేదా అనే అంశాలతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ సాగింది.