“భజే వాయు వేగం” ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

ఈ నెలాఖరుకు రిలీజ్ అ‌వుతున్న సినిమాల్లో బాక్సాఫీస్ అడ్వాంటేజ్ ఉన్న సినిమా “భజే వాయు వేగం”. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా యూవీ కాన్సెప్ట్స్ లో నిర్మాణం కావడం విశేషం. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి “భజే వాయు వేగం” సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.15 గంటలకు “భజే వాయు వేగం” ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోగా..ఈ నెల 25న రిలీజ్ కానున్న ట్రైలర్ తో “భజే వాయు వేగం” ఎలా ఉంటుందనే క్లారిటీ రానుంది. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ నేషనల్ వైడ్ రిలీజ్ చేయనుంది.