వెబ్ సిరీస్ లను తక్కువగా చూసే ట్రెండ్ కాదిది. సినిమాల కంటే బిగ్ స్పాన్, బడ్జెట్, కాస్టింగ్ తో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఇలా సినిమాను మించిన మ్యాజిక్ చేసేందుకు వస్తోంది “యక్షిణి”. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణంలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ సిరీస్ ను అనౌన్స్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు తేజ మార్ని “యక్షిణి” సిరీస్ ను రూపొందిస్తున్నారు. టైటిల్ రోల్ లో వేదిక లుక్ రివీల్ చేస్తూ ఇవాళ “యక్షిణి” పోస్టర్ రిలీజ్ చేసింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. మూడు డిఫరెంట్ లుక్స్ లో వేదిక ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ లో ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలు ఆకట్టుకోబోతున్నాయి. జూన్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.