తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసిందీ షో..లేటెస్ట్ గా బిగ్ బాస్ 7కు స్టార్ మా ముహూర్తం ఖరారు చేసింది. బిగ్ బాస్ 7 కమింగ్ సూన్ ప్రోమో స్టార్ మాలో ప్రసారమవుతోంది. బిగ్ బాస్ ఇక ఉండదేమో అనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ కొత్త సీజన్ రెడీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ క్రమంగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఓటీటీలో ప్రసారమయ్యాక మరింత మంది చూస్తున్నారని నిర్వాహకులు చెప్పినా…ఓటీటీ ఎంతమందికి అందుబాటులో ఉంటుందనేది చెప్పలేం. అయినా బిగ్ బాస్ సీజన్ 7 ముందడుగే వేస్తుున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ షో మొదలవుతుందని సమాచారం. పోటీదారులు ఎవరు, ఎవరు హోస్టింగ్ చేస్తారనేది తెలియాల్సిఉంది.