“దేవర” సాంగ్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ రివ్యూ

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ఈ నెల 19న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సాంగ్ విన్న నిర్మాత నాగవంశీ పాటపై రివ్యూ ఇచ్చారు. రజినీకాంత్ జైలర్ సినిమాలోని హుకుం పాటను మర్చిపోయేలా దేవర ఫియర్ సాంగ్ ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. అనిరుధ్ అలాంటి మంచి ట్యూన్ చేశారని నాగవంశీ తెలిపాడు.

గతంలో గుంటూరు కారం సినిమా రిలీజ్ ముందు ఈ సినిమా నాన్న రాజమౌళి మూవీస్ కలెక్షన్స్ క్రాస్ చేస్తుందని చెప్పాడు. దాంతో దేవరకు నాగవంశీ రెస్పాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కంగారుపెడుతోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర సినిమా ఫస్ట్ పార్ట్ ఈ అక్టోబర్ 10న దసరాకు రిలీజ్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.