రివ్యూ – ఆరంభం

నటీనటులు – మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి, సినిమాటోగ్రఫీ – దేవ్ దీప్ గాంధీ కుందు, మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి, డైలాగ్స్ – సందీప్ అంగిడి, ప్రొడ్యూసర్ – అభిషేక్ వీటీ, దర్శకత్వం – అజయ్ నాగ్ వీ

ఈవారం రిలీజైన సినిమాల్లో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన మూవీ ఆరంభం. హ్యూమన్ ఎమోషన్స్ సైన్స్ ఫిక్షన్ కలగలిసిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ తో టెక్నికల్ గా ఈ సినిమా మంచి క్వాలిటీ ఉందని తెలిసింది. థియేటర్ లో ఈ మూవీ ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మిగిల్ (మోహన్ భగత్). అతనికి ఉరి శిక్ష పడుతుంది. రేపు ఉరి తీస్తారని అనగా రాత్రి జైలు నుంచి ఆశ్చర్యకరంగా తప్పించుకుంటాడు. తాళం పగలగొట్టకుండా, గోడలు బద్దలకు గొట్టకుండా, గ్రిల్స్ కట్ చేయకుండా మిగిల్ జైలు నుంచి పారిపోతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం డిటెక్టివ్ (రవీంద్ర విజయ్) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జైలులో మిగిల్ రాసుకునే ఓ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ లో తన ఫేవరేట్ ప్రొఫెసర్ (భూషమ్ కల్యాణ్) గురించి, అతను చేసే డెజావు ఎక్స్ పర్మెంట్స్ గురించి ఉంటుంది. అమ్మతో హాయిగా నవ్వుతూ ఉండే మిగిల్, ప్రొఫెసర్ దగ్గర ఆసక్తిగా థియరీలు వినే మిగిల్ హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు, జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగిలిన స్టోరి.

ఎలా ఉందంటే

కన్నడ నవల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అయితే నవలలో వదిలేసిన ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో ఇవ్వడం విశేషం. మదర్ సెంటిమెంట్, హ్యూమన్ ఎమోషన్, ప్రొఫెసర్, స్టూడెంట్ మధ్య రిలేషన్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ సినిమా. ద్వితీయార్థంలో వచ్చే ఓ ట్విస్ట్ అదిరిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా హాయిగా ప్లెజెంట్ గా సినిమా సాగుతుంది. సినిమా పిక్చరైజ్ చేసిన లొకేషన్స్ కూడా కథలో ఓ క్యారెక్టర్ లా అనిపిస్తాయి. అంతమంచి లొకేషన్స్ లో తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపు కాస్ట్ అండ్ క్రూ మంచి టీమ్ వర్క్ చేసిన కోఆర్డినేషన్ కనిపిస్తుంటుంది. మోహన్ భగత్ లీడ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాకు దీనికి కొంత గ్యాప్ తీసుకున్నా…ఆ గ్యాప్ ఫిల్ చేసే గుడ్ మూవీతో వచ్చాడు. హీరోయిన్ గా సుప్రిత అందంగా ఉంది. పర్ ఫార్మెన్స్ బాగా చేసింది. సురభి ప్రభావతి తల్లిగా మెప్పిస్తే..డిటెక్టివ్ లుగా రవీంద్ర విజయ్, అభిషేక్ బొడ్డేపల్లి తమ పాత్రలకు కంప్లీట్ జస్టిస్ చేశారు. టెక్నికల్ గా చూస్తే అన్ని అవార్డులు దక్కించుకునే సినిమా ఆరంభం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్..ఇలా ప్రతి క్రాఫ్ట్ లో క్వాలిటీ కనిపించింది. ఆరంభం లాంటి రేర్ అటెంప్ట్ చేసిన డైరెక్టర్ అజయ్ నాగ్ ను అప్రిషియేట్ చేయొచ్చు.

రేటింగ్ 3.5/5