లేటెస్ట్ గా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వచ్చీ రాగానే ఈ వేదిక మీద సునామీ సృష్టించారు. ఒక్క పోస్ట్ చేయకుండానే 2 మిలియన్ ల ఫాలోవర్స్ దిశగా పవన్ ఇన్ స్టా అక్కౌంట్ పరుగులు పెడుతోంది. అతి తక్కువ సమయంలో మిలియన్ ఫాలోవర్స్ పొందిన 9వ సెలబ్రిటీగా పవన్ రికార్డ్ లు సృష్టించారు.
ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ పోస్ట్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తన కొత్త సినిమా ఓజీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా లేక పొలిటికల్ గా జనసేన నిర్ణయాలు ప్రకటిస్తారా అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అభిమానులకు సినిమాలతో పాటు పార్టీ నిర్ణయాలూ ముఖ్యమే కాబట్టి ఏదైనా లైక్స్, షేర్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు అంతా చూడాలనుకునేది పవన్ చేయబోయే ఆ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్ ఏంటన్నదే.