కమెడియన్ హర్ష చెముడు లీడ్ రోల్ చేసిన సుందరం మాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి సుందరం మాస్టర్ స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈటీవీ విన్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయాల్సిఉంది. ఇటీవల రిలీజైన సినిమాల్లో ఎక్కువగా ఈటీవీ విన్ స్ట్రీమింగ్ చేస్తోంది. గత నెల 23న సుందరం మాస్టర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అంతంతమాత్రమే రెస్పాన్స్ దక్కింది. ఓ మారుమూల గ్రామానికి ఇంగ్లీష్ పాఠాలు చెప్పేందుకు వెళ్లిన సుందరం మాస్టర్ అక్కడి ప్రజలు, నాయకులతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. సుందరం మాస్టర్ సినిమాను కొత్త దర్శకుడు కల్యాణ్ సంతోష్ తెరకెక్కించారు. దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను హీరో రవితేజ ప్రొడ్యూస్ చేయడం విశేషం.