నటీనటులు – ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – ఎస్.వి. విశ్వేశ్వర్, ఎడిటింగ్ – శ్రావణ్, మ్యూజిక్ – అజయ్ అరసాడ, రైటర్స్ – ప్రదీప్ అద్వైతం, విజయ్ నామోజు, ఎస్ ఆనంద్ కార్తీక్, క్రియేటర్స్ – మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం, డైరెక్షన్ – అరుణ్ కొత్తపల్లి
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చేసింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ సీజన్ సేవ్ ద టైగర్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ఈ సెకండ్ సీజన్ ను ఫస్ట్ డే నుంచే ఓటీటీ లవర్స్ చూస్తున్నారు. ‘సేవ్ ద టైగర్స్ 2‘ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ఈ మ్యారీడ్ లైఫ్ నుంచి సరదాగా చిల్ కావాలని అనుకునే విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమటం), రవి (ప్రియదర్శి) అనూహ్యంగా ఓ హీరోయిన్ మిస్సింగ్ కేసులో ఇరుక్కుంటారు. హంసలేఖ (సీరత్ కపూర్)ను ఈ ముగ్గురే కిడ్నాప్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేస్తారు. వీళ్లతో నిజం చెప్పించేందుకు లాఠీలకు పనిచేప్తారు. మరోవైపు మీడియాలో ఈ ముగ్గురు పేర్లు మార్మోగుతుంటాయి. హంసలేఖను వీళ్లే చంపారంటూ ప్రచారం జరుగుతుంది. హంసలేఖ స్వయంగా వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులు విక్రమ్, రాహుల్, రవిని వదిలేస్తారు. పోలీసులు వదిలేసినా…ఈ హీరోయిన్ తో స్నేహం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. మూడు జంటల మధ్య గొడవలు మొదలవుతాయి. ఈ గొడవలకు కారణం ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకున్నారు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
జంపింగ్ ఇంటూ కన్ క్లూజన్స్ ..అనేది మన ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంటుంది. ఇది ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికీ అనుభవం కూడా. ఇదే విషయాన్ని ఫన్, ఎంటర్ టైనింగ్, ఎమోషన్ తో కలిపి చూపించారు సేవ్ ద టైగర్స్ 2 వెబ్ సిరీస్ లో. పక్క వాళ్ల మీద మనమో ఓపీనియన్ క్రియేట్ చేసుకుని అదే నిజమని నమ్మడం తప్పనే మంచి సందేశాన్నిస్తుందీ సిరీస్. భార్యా భర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చెబుతుంది. అలాగని ఎక్కడా సందేశాలు ఇచ్చినట్లు ఉంవు. ఈ మూడు జంటల మధ్య సాగే డ్రామా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. క్రియేటర్ మహి వి రాఘవ్ చెప్పినట్లు స్లైస్ ఆఫ్ కామెడీ సిరీస్ ఇది. మన లైఫ్ లలో ఈ కథను చాలా చోట్ల రిలేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చే ఎపిసోడ్స్ బాగా నవ్విస్తాయి. సినిమా కథల్లో ప్రీ క్లైమాక్స్ కు కథ సీరియస్ అయినట్లు ఈ సిరీస్ లోనూ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత స్టోరి ఇంటెన్స్ గా మారుతుంది. అయితే మళ్లీ చివరలో ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేయడంతో సేవ్ ద టైగర్స్ 2 తన బేసిక్ ఇన్ స్టింక్ట్ ను ప్రదర్శించింది.
నటీనటులకు ఇది టైలర్ మేడ్ సిరీస్. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ లీడ్ రోల్స్ లా మారిపోయారు. ఈ క్యారెక్టర్స్ ను తమ పర్ ఫార్మెన్స్ లతో మరింత ఎలివేట్ చేశారు. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో ఈ ముగ్గురు నటులూ ఇంప్రెస్ చేస్తారు. అలాగే ఫీమేల్ లీడ్స్ జోర్దార్ సుజాద, దేవియాని శర్మ, పావని గడుసైన భార్యలుగా ఆకట్టుకున్నారు. సీరత్ కపూర్ క్యారెక్టర్ ఎంతో స్పెషల్ అని చెప్పాలి. దర్శకుడిగా అరుణ్ కొత్తపల్లి తన విజన్ ను స్క్రీన్ మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. టెక్నికల్ గా అజయ్ మ్యూజిక్, విశ్వ కెమెరా పనితనం హైలైట్ అయ్యాయి. ఈ వీకెంట్ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ 2.
రేటింగ్ 3.5/5