ఆపరేషన్ వాలెంటైన్ – వరుణ్ తేజ్ ఖాతాలో మరో ఫ్లాప్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటారు. ఆయన కెరీర్ లో చేసిన కమర్షియల్ సినిమాలు హిట్టవడం, ప్రయోగాత్మక సినిమాలు ఫ్లాప్ అవడం చూస్తుంటాం. ఈ లెక్కన వరుణ్ తేజ్ కు ఈ రొటీన్ కు భిన్నమైన సినిమాలు అచ్చి రావడం లేదనే చెప్పాలి. వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ హిందీ, తెలుగు బైలింగ్వల్ మూవీ తెలుగులో పూర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటోంది.

ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ నిరాశపరుస్తున్నాయి. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. కలెక్షన్స్ పుంజుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్ లో ఆపరేషన్ వాలెంటైన్ మరో డిజాస్టర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ గత సినిమా గాంఢీవదారి అర్జున కూడా ఇలాగే బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ హీరో మట్కా అనే సినిమాలో నటిస్తున్నారు. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న మట్కా పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.