సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ, క్రేజీ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మహేష్ కు యాక్షన్ పార్ట్ నచ్చకపోవడంతో తీసింది అంతా పక్కపడడేసి కొత్తగా స్టార్ట్ చేశారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు బాగానే ఉంది అంతా సెట్ అయ్యింది అనుకుంటే.. మళ్లీ మొదటకొచ్చిందని.. సినిమానే పూర్తిగా ఆగిపోయిందని ప్రచారం ఊపందుకుంది.
దీంతో గుంటూరు కారం నిజంగా ఆగిపోయిందా..? లేక ఇది గ్యాసిప్పా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఓ వైపు పూజా హేగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందని ఓ వార్త వచ్చింది. మరో వైపు తమన్ ఈ సినిమా నుంచి అవుట్ అంటూ మరో వార్త. ఇలా సినిమా గురించి రోజుకో వార్త ప్రచారంలోకి రావడంతో అసలు ఏం జరుగుతుంది ఈ సినిమా విషయంలో అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. పూజా తప్పుకోవడం నిజమే అని… తమన్ తప్పుకోవడం కరెక్ట్ కాదని తెలిసింది. ఈ నెలలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. మరి… సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో చూడాలి.