100 రోజుల్లో సలార్ సంచలనం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పై విమర్శలు వచ్చినప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ప్రభాస్ నుంచి రానున్న నెక్ట్స్ మూవీ సలార్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి నేటికి సరిగ్గా 100 రోజులు ఉంది. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచేలా చేశారు. ఈ సినిమాకి బిజినెస్ వర్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవరీ సీస్ లో కూడా భారీగా పోటీ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఎక్కువ రేటు పలుకుతుండడం విశేషం. త్వరలో సలార్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో కరెక్ట్ గా అలా ఉండేలా ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. మరి.. సలార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.