చిరు మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వలే సోషియో ఫాంటసీ మూవీ. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్స్ ఉంటారని.. ఈ ఎనిమిది మందికి ఇందులో ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. ఈ భారీ, క్రేజీ మూవీకి ముల్లోకవీరుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే… చిరు, కీరవాణిల కాంబినేషన్ లో మంచి సాంగ్స్ వచ్చాయి. మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే.. కీరవాణి ఇచ్చే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. చాలా కాలంగా వీరిద్దరి కాంబో సినిమాలు రాలేదు. ఇప్పుడు మల్లిడి వశిష్ట్ తో చేసే సినిమాకి కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారని సమాచారం. బింబిసార సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. ఆ సినిమా సక్సెస్ లో కీరవాణి కీలక పాత్ర పోషించారు. మల్లిడి వశిష్ట్ సెంటిమెంట్ గా ఫీలై కీరవాణిని కంటిన్యూ చేయాలి అనుకున్నారట. దీనికి చిరు ఓకే చెప్పారట. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.