ఎన్టీఆర్ జోడీగా ఆలియా భట్

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ స్ట్రైట్ మూవీ వార్ 2. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ వార్ కు సీక్వెల్ గా వార్ 2 ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా నిర్మాణమవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న వార్ 2 నుంచి హీరోయిన్ అప్డేట్ తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ సరసనే ఆలియా ఉంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమె రామ్ చరణ్ అల్లూరి పాత్రకు జోడీగా కనిపించింది. వార్ 2 లో ఎన్టీఆర్ తో ఆమె కాంబో కొత్తగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.