నటీనటులు – మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఆర్ట్ – రాజ్ కమల్, ఎడిటింగ్ – భరత్ విక్రమన్, సినిమాటోగ్రఫీ – శ్రేయాస్ కృష్ణ, మ్యూజిక్ – సీన్ రోల్డన్, తెలుగు డైలాగ్స్ – మౌళి, ప్రొడ్యూసర్స్ – నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్, తెలుగు ప్రెజెంటర్స్ – మారుతి, ఎస్ కేెన్, రచన దర్శకత్వం – ప్రభురామ్ వ్యాస్
చిన్న సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రోజులివి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా కంటెంట్ లేకుంటే షోస్ క్యాన్సిల్ అవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తూ థియేటర్స్ లోకి వచ్చింది ట్రూ లవర్ సినిమా. మణికందన్, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. తెలుగులో మారుతి, ఎస్ కేఎన్ విడుదల చేశారు. ట్రూలవర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న జంట అరుణ్ (మణికందన్), దివ్య (గౌరి ప్రియ). కాలేజ్ నుంచి మొదలైన వీరి ప్రేమలో నిత్యం ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. గొడవపడి విడిపోయినా..మళ్లీ సర్దుకుపోయి కలుస్తుంటారు అరుణ్, దివ్య. ఓ కంపెనీలో దివ్య పనిచేస్తుంటుంది. అరుణ్ మాత్రం సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని ట్రై చేస్తుంటాడు. కంపెనీలో దివ్య కొలీగ్స్, ఫ్రెండ్స్ ను చూస్తే అరుణ్ కు చిరాకు వేస్తుంటుంది. దివ్య అరుణ్ ను సైడ్ చేస్తూ తన కంపెనీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో దివ్య అరుణ్ కు , అరుణ్ దివ్యకు అబద్ధాలు చెబుతుంటారు. దీంతో వీరి మధ్య గొడవలు మరింతగా పెరుగుతాయి. ఈ క్రమంలో అరుణ్, దివ్యల లవ్ నిలబడిందా, వాళ్ల ప్రేమ కథ ఎలా కొనసాగింది అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే..
ప్రేమలో ఒకరి మీద మరొకరికి నమ్మకం ఉండాలనే పాయింట్ చుట్టూ ట్రూలవర్ సినిమా సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి మీద మొత్తం హక్కు నాదే అనుకుంటాడు ఏ అబ్బాయి అయినా. మగవాడిలో సహజంగా ఉండే ఒక ఈగో ఇలా చేయిస్తుంటుంది. అదే టైమ్ లో అమ్మాయికి తన స్వేచ్ఛ, స్నేహితులు, ఉద్యోగం కావాలి. ఈ రెండింటి మధ్య అటు అబ్బాయి, ఇటు అమ్మాయి ఇబ్బంది పడిన విధానాన్ని హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. అరుణ్, దివ్యల మధ్య చిన్న చిన్న గొడవలతో విబేధాలు రావడం తిరిగి కలిసిపోవడంతో మొదట కొద్ది సేపు సరదాగా సాగినా..ఆ తర్వాత మాత్రం ఇలాంటి సందర్భాలు సీరియస్ గా మారుతుంటాయి.
తన లవర్ తో మరొకడు ఫ్రెండ్లీగా ఉంటే తట్టుకోలేని అబ్బాయిలంతా హీరో క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు. అలాగే తమకూ స్వేచ్ఛ ఉండాలని కోరుకునే అమ్మాయి దివ్య పాయింట్ ఆఫ్ వ్యూతో రిలేట్ అవుతారు. ఇలా రెండు క్యారెక్టర్స్ జర్నీని ఎమోషనల్ గా, ఆసక్తికరంగా చూపిస్తుందీ సినిమా. మణికందన్, శ్రీ గౌరి ప్రియ అరుణ్, దివ్య పాత్రల్లో జీవించారని చెప్పాలి. వీళ్లు సినిమానంతా తమ భుజాలపై మోశారు. దర్శకుడి విజన్ ను తమ పర్ ఫార్మెన్స్ లో రిఫ్లెక్ట్ చేశారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సీన్ రోల్డన్ మ్యూజిక్ ట్రూలవర్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. వాలెంటైన్స్ వీకెండ్ లో ఇలాంటి పర్పెక్ట్ లవ్ ఫిల్మ్ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో రాలేదని చెప్పాలి.
రేటింగ్ 3.5/5