డీజే టిల్లు సినిమాలో రాధికగా నేహా శెట్టి చాలా ఈజ్ తో నటించింది. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ హీరో టిల్లు క్యారెక్టర్ తో పోటీ పడింది. కావాల్సిన చోట అందాన్ని చూపిస్తూ…న్యాచులర్ గా నటిస్తూ ఆకట్టుకుంది నేహా శెట్టి. ఇప్పుడా బాధ్యత సీక్వెల్ సినిమా టిల్లు స్క్వేర్ లో అనుపమ తీసుకుంది. అనుపమ పరమేశ్వరన్ కు ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్ కొత్త. గతంలో రౌడీ బాయ్స్ లో ముద్దులు అవీ పెట్టినా…రాధిక క్యారెక్టర్ స్టైల్ ఇంకాస్త వేరు. అనుపమ టిల్లు స్క్వేర్ లో లిల్లీ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ లిల్లీ పాత్రను ఆమె హార్ట్ ఫుల్ గా పోట్రే చేస్తున్నట్లు కనిపించడం లేదు.
నిన్న సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో అనుపమ కనిపించిన విధానం చూస్తే..ఏదో ఉండాలి కాబట్టి ఉన్నా అనే ఇంప్రెషన్ కలిగించింది. ఇందులో కూడా ముద్దులు బాగానే పెట్టిస్తున్నారు ఆమెతో. అనుపమ ఎంత గ్లామర్ గా కనిపిస్తే అంత అడ్వాంటేజ్ టిల్లు స్క్వేర్ కు కానుంది. ఇందులో సిద్ధు చేసే కామెడీ, అనుపమ చూపించే అందమే మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ నెల 14న టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. సినిమా మార్చి 29న స్క్రీన్స్ మీదకు రానుంది.