రాఖీ భాయ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలన విజయం సాధించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న స్టార్ యశ్. కేజీఎఫ్ 2 తర్వాత తన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమా చేయాలని చాలా కథలు విన్నాడు. అయితే.. ఇప్పటి వరకు యశ్ తన నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు యశ్ తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాడా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మూతన్ ఫేమ్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ సినిమా చేయబోతున్నాడు అంటూ కన్నడ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఈ వార్త గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. యశ్ కూడా స్పందించలేదు. దీంతో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనా..? లేక వేరే ప్రాజెక్ట్ ఉందా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. గీతు మోహన్ దాస్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికే ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాతో వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని.. ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది.