మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు ఎవరు..?

బాలయ్య తన నటవారసుడు మోక్ష్ఞ ఎంట్రీ కోసం గత కొంతకాలంగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి కథతో పరిచయం చేయాలి.? ఎవరి డైరెక్షన్ లో పరిచయం చేయాలి..? అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆమధ్య బోయపాటి పేరు బాగా వినిపించింది. ఆతర్వాత క్రిష్ పేరు కూడా వినిపించింది. అయితే… తొలి చిత్రానికి యాక్షన్ మూవీ కాకుండా యాక్షన్ తో ఉండే లవ్ స్టోరీ అయితే.. బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. బోయపాటి శ్రీను అయితే… సినిమా పై భారీగా అంచనాలు ఉంటాయి పైగా ఫస్ట్ మూవీకి బోయపాటి కరెక్ట్ కాదు అనుకుంటున్నారట.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారని వార్త ప్రచారంలోకి వచ్చింది. చరణ్ ను హీరోగా పరిచయం చేసింది పూరినే. ఇప్పుడు చరణ్ ఏ రేంజ్ లో ఉన్నాడో తెలిసిందే. అందుచేత పూరి అయితే.. హీరోను కొత్తగా చూపిస్తాడు. క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు అని ఆలోచిస్తున్నారట. గతంలో కూడా పూరి పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అంటే భారీగా అంచనాలు ఉంటాయి. అంత టెన్షన్ తట్టుకోలేమని.. రెండో సినిమా చేస్తానని బాలయ్య ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. ఇప్పుడు మరోసారి పూరిని కాంటాక్ట్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ నెక్ట్స్ ఇయర్ కన్ ఫర్మ్ అంటున్నారు. మరి.. బాలయ్య నట వారసుడ్ని డైరెక్ట్ చేసే తొలి చిత్ర దర్శకుడు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.