యాంకర్ సుమకు కోట్ల రూపాయల నష్టం

కొడుకు రోషన్ ను హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నంలో యాంకర్ సుమ తీవ్రంగానే ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. రోషన్ హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సుమ ప్రొడ్యూస్ చేసిన బబుల్ గమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాకు పేరుకు పీపుల్ మీడియా బ్యానర్ వేసినా…మొత్తం ఖర్చంతా సుమనే పెట్టుకుంది. బబుల్ గమ్ సినిమాకు దాదాపు 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.

రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన బబుల్ గమ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. థియేటర్స్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ లేదు. దీంతో డే 1 నుంచి ఈ సినిమాకు 50 లక్షల రూపాయలకు మించిన వసూళ్లు రాలేదు. ఇలా నాలుగు రోజుల పాటు దాదాపు 2 కోట్ల రూపాయల గ్రాస్, దాదాపు కోటి రూపాయల షేర్ వచ్చాయి. హాలీడేస్ పూర్తయ్యాయి కాబట్టి ఇక కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదు. ఓటీటీ, ఇతర రైట్స్ నుంచి ఇంకొంత దక్కినా..మిగిలినదంతా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అనుకోవచ్చు.