రివ్యూ – డెవిల్

నటీనటులు – క‌ల్యాణ్‌రామ్, సంయుక్తా మీనన్, మాళవిక అయ్యర్, అజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్ – మ్యూజిక్ – హర్షవర్థన్ రామేశ్వర్, సినిమాటోగ్రఫీ – సౌందర్ రాజన్, ఎడిటర్ – తమ్మిరాజు, నిర్మాత – అభిషేక్ నామా

కల్యామ్ రామ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ డెవిల్ ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. ఈ ఇయర్ ఎండ్ లో వచ్చిన బిగ్ మూవీ ఇదే అనుకోవచ్చు. బ్రిటీష్ కాలం నాటి ఈ ఏజెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
భారతదేశంలో బ్రిటీష్ పాలనా కాలంలో జరిగే కథ ఇది. బ్రిటీష్ పాలకులు మెచ్చిన ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్). ఆ కాలంలో ఓ జమీందారు కుటుంబంలో మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగుతాడు డెవిల్. ఈ కేసు విచారణలో ఆ దివాణంలో ఉంటున్న నైషధ (సంయుక్తా మీనన్) మీద డెవిల్ కు అనుమానం కలుగుతుంది. నైషధను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు. ఆమె నేపథ్యం ఏంటి, డెవిల్ నిజంగానే బ్రిటీష్ ఏజెంటేనా, ఈ కథలో మాళవిక నాయర్ ఏం చేసింది అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

బ్రిటీష్ కాలం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా డెవిల్ బిగినింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. బ్రిటీష్ ఏజెంట్ గా డెవిల్ సాహసాలు, అతని సామర్థ్యం, ఎలాంటి ఇష్యూలోనైనా రంగంలోకి దిగి సాల్వ్ చేయగల డెవిల్ తెలివితేటలు ఆకట్టుకుంటాయి. డెవిల్ క్యారెక్టర్ లో టైలర్ మేడ్ పర్ ఫార్మెన్స్ చేశారు కల్యాణ్ రామ్. ఈ క్యారెక్టర్ కోసం అన్ని విధాలా సిద్ధమయ్యాడు కల్యాణ్ రామ్. బింబిసార కోసం గతంలో ఎలా పర్ ఫెక్ట్ గా మేకోవర్ అయ్యాడో డెవిల్ లోనూ కల్యాణ్ రామ్ అలాగే రెడీ అయ్యాడు. దివాణంలో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. నైషధ గురించి డెవిల్ తెలుసుకోవడం, డెవిల్ ఎవరో రివీల్ కావడం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. నైషధతో డెవిల్ లవ్ ట్రాక్ కూడా మెప్పిస్తుంది. కథలోని కొన్ని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ దర్శకుడికి దక్కుతుంది. కల్యాణ్ రామ్ తో డైరెక్టర్ చేయించిన యాక్షన్ సీన్స్ కూడా టాప్ క్వాలిటీతో ఉన్నాయి. నైషధగా సంయుక్తా మీనన్ తన నటనతో మరోసారి ఇంప్రెస్ చేసింది. మాళవిక నాయర్ క్యారెక్టర్ కు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అనుకున్నంత ఆడియెన్స్ కు రీచ్ కాలేకపోయాయి. చాలా చోట్ల లాజిక్ మిస్ చేస్తూ కథనాన్ని నడిపారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వంటి టెక్నికల్ వర్క్స్ బాగున్నాయి.