కేరళ వెళ్తున్న మహేశ్, శ్రీలీల

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా బుల్లెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ కు తీసుకొస్తుండగా…వీలైనంత ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేసుకుని కంఫర్ట్ గా రిలీజ్ కు వెళ్లాలని టీమ్ భావిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరితో మహేశ్ కాంబో సీన్స్ చిత్రీకరించిన దర్శకుడు త్రివిక్రమ్…వీరి కాంబోలో ఓ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు.

ఇక త్వరలోనే శ్రీలీల, మహేశ్ కాంబోలో ఓ సాంగ్ షూటింగ్ చేయబోతున్నారు. ఇందు కోసం గుంటూరు కారం టీమ్ కేరళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి అందమైన లొకేషన్స్ లో మహేశ్, శ్రీలీల మధ్య డ్యూయెట్ తీయనున్నారు. ఈ పాటతో ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ దశకు చేరుకుంటుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీతో రెడీగా ఉండాలని గుంటూరు కారం టీమ్ భావిస్తోంది.