ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా హేగ్డే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతుండడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఇందులో పవన్ కు జంటగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అసలు హరీష్ శంకర్ ఈ మూవీలో ముందుగా పూజా హేగ్డేనే అనుకున్నాడు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండడం వలన తప్పుకుంది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇందులో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కోసం పూజానే తీసుకోవాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై హరీష్ శంకర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.