రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఇందులో బన్నీకు జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఫాహిద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. పుష్ప చిత్రం సంచలనం సృష్టించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేస్తే తక్కువ టైమ్ లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉండడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సమ్మర్ లో పుష్ప 2 చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట మొదలుపెట్టింది. పుష్ప సినిమా విజయంలో ఆడియో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు పుష్ప 2 ఆడియోను అంతకు మించి అనేలా రెడీ చేస్తున్నారు. అందుకనే పుష్ప 2 ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి అని తెలిసింది. టీ సిరీస్ సంస్థ అన్ని భాషల ఆడియో రైట్స్ ను దాదాపు 65 కోట్లకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రిలో ఇదే రికార్డ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సైతం.. 30 కోట్లే వ‌చ్చాయి. వాటితో పోలిస్తే… పుష్ప 2 రెట్టింపు ధ‌ర‌ని సొంతం చేసుకొన్న‌ట్టే. పుష్ప 2 రిలీజ్ కు ముందే రికార్డుల వేట మొదలైంది. ఇక రిలీజ్ తర్వాత పుష్ప 2 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..?