ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ అదిరింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు తిరుపతిలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక జరిని ప్రాంతం అంతా జై శ్రీరామ్ నామంతో మారుమ్రోగింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత భారీగా ప్రీ రిలీజ్ వేడుక జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా ఈ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ వేడుకలో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ భిక్షాందేహి అంటూ రావణుడు సీత దగ్గరకు వచ్చిన సన్నివేశంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆతర్వాత వస్తున్నా.. రావణ న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్, విజువల్స్ వావ్ అనేలా ఉన్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను ఆదిపురుష్ ఆకట్టుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని మరోసారి కలిగించింది. జూన్ 16న ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.