భర్త ఎవరో చెప్పకుండానే బిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ ఇలియానా. కొడుకుకు కోయ ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టుకుంది. ఆమె బిడ్డకు జన్మనిచ్చాక సోషల్ మీడియాలో వస్తున్న ప్రెజర్ తో మైఖేల్ డోలన్ అనే అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. ఇలా అడిగివాళ్లకు చూపించేందుకు పబ్ లో అతనితో ఒక ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇలియనాకు అతనితో పెళ్లయినట్లు ఎక్కడ కనిపించలేదు. వీరి పెళ్లి ఫొటో ఏదీ బయటకు రాలేదు.
ఇప్పుడు బిడ్డకు రెండు నెలల వయసొచ్చింది. ఆ పిల్లాడిని చూసుకుంటూనే ఉంటోంది ఇలియానా. సినిమాల్లో నటించడం ఆపేసింది. కొన్నాళ్ల తర్వాత మల్లీ నటించాలని అనుకుంటోంది. రీసెంట్ ఛిట్ ఛాట్ లో ఇలియానాను మీరు సింగిల్ పేరెంట్ కదా అని అడిగిన ప్రశ్నకు కాదంటూ సమాధానం చెప్పింది ఇలియానా. గతంలో ఒకసారి మైఖేల్ అనే అతనితో దిగిన ఫొటోను మళ్లీ షేర్ చేసింది. భర్త ఉంటే కొడుకుతో ఒక్కసారైనా ఫొటోలో కనిపించాలి కదా. తాను సింగిల్ పేరెంట్ అనే నిజాన్ని దాచేందుకు బాగా ట్రై చేస్తోంది ఇలియానా.