పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ స్పిరిట్ ను నిర్మించనుంది. పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటించనున్న ఈ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. స్పిరిట్ సినిమా ఎప్పుడు బిగిన్ అవుతుంది అనే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.
ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన వెంటనే స్పిరిట్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని సందీప్ వంగా చెప్పాడు. అంటే డిసెంబర్ సెకండ్ వీక్ కల్లా స్పిరిట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ను చూడాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.