సిద్థార్థ్ ప్రయత్నం ఫలిస్తుందా..?

నువ్వొస్తానంటే నొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న తమిళ హీరో సిద్థార్థ్. తెలుగులో స్పష్టంగా మాట్లాడడం.. పాటలు కూడా పాడడం సిద్థార్థ్ స్పెషల్. అందుకనే సిద్థార్థ్ ను చూస్తే.. తెలుగువాడేనేమో అనుకుంటారు. అంతలా గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ్ కొన్ని కారణాల వలన తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల పై పోకస్ పెట్టాడు. ప్రపంచమే తెలుగు సినిమా వైపు చూస్తుండడంతో సిద్థార్థ్ మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలి అనుకోవడంలో కొత్త ఏమీ లేదు.

జూన్ 9న టక్కర్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తుండడంతో ఈ సినిమా ఎంత వరకు మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇది న్యూఏజ్ లవ్ స్టోరీ అని.. ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని సిద్థార్థ్ నమ్మకంగా ఉన్నాడు. అంతే కాకుండా.. తనకు తెలుగు సాహిత్యం బాగా తెలుసని.. తన మనసులో తెలుగు సాహిత్యం బాగా కలిసిపోయిందన్నారు. మొత్తానికి మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. మరి.. సిద్థార్థ్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో..?