గరుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు

గురుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు అనగానే.. ఎవరా గురుశిష్యులు అనుకుంటున్నారా..? గురువు తేజ, శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి. డైరెక్టర్ తేజ దగ్గర రాకేష్ ఉప్పలపాటి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాడు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సర్ మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. ఇదే రోజున తేజ తెరకెక్కించిన అహింస సినిమా కూడా విడులైంది.

ఒకే రోజు గురువు తేజ తెరకెక్కించిన అహింస, శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి తెరకెక్కించిన నేను స్టూడెంట్ సర్ చిత్రాలు రిలీజ్ కావడం విశేషం. అయితే.. అహింస చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. థియేటర్లో అహింస.. చూస్తున్న జనాలకు మాత్రం హింస అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడుతున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నేను స్టూడెంట్ సర్ సినిమాకి మాత్రం పాజిటివ్ టాక్ అండ్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో.. ఈ గురుశిష్యుల పోటీలో శిష్యుడు విజయం సాధించడం విశేషం.