“సలార్” రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. నేటి నుంచి 50 రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో 50డేస్ టు సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో ఈ ట్రెండింగ్ తో తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది. శృతి హాసన్, మలయాళ నటుడు పృథ్వీరాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ థియేటర్స్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.