రేపు SDT17 ఫస్ట్ హై రిలీజ్

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా అప్ డేట్ రేపు అనౌన్స్ కానుంది. ఇది సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 17వ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ హై ని రేపు ఉదయం 8.55 రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది.

ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు సంపత్ నంది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేయడంతో పాటు కొంత పార్ట్ షూటింగ్ కూడా చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది విరూపాక్ష హిట్ తో ఫామ్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా మరో మంచి ప్రాజెక్ట్ కానుంది. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ తో రచ్చ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది…ఈ సినిమానూ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు.