నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఇవాళ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించగా…దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో చూస్తున్న వారంతా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.
గత నెల 7న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో పాటు గుడ్ ఫిల్మ్ అనే పేరొచ్చింది. ఇండస్ట్రీ లో చిరంజీవి, మహేశ్, సమంత, రవితేజ, రాజమౌళి, దిల్ రాజు వంటి ప్రముఖులు చాలా మంది అప్రిషియేట్ చేశారు. పెళ్లి కాకుండా తల్లి కావాలనుకునే అన్విత, ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేని సిద్ధు క్యారెక్టర్ నవీన్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది.