ఇటీవల కేరళలో పట్టుబడిన డ్రగ్స్ ముఠాతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పింది హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ కేసులో తన మేనేజర్ ఆదిలింగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతనితో తనకు ఎలాంటి డ్రగ్ డీల్స్ లేవని ఆమె తెలిపింది. కొద్ది రోజుల క్రితం కేరళలో డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. అందులో వరలక్ష్మీ మేనేజర్ ఉన్నారు. దాంతో ఆమెకు కూడా నోటీసులు ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మీ.
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ – ఆదిలింగం నా దగ్గర మేనేజర్ గా పనిచేశాడు. విజయ్ సర్కార్ మూవీతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత అతను నా దగ్గర మానేశాడు. డ్రగ్ కేసులో అతనికి నోటీసులు ఇచ్చారని తెలిసింది. నాకు ఎలాంటి నోటీసులు, ఫోన్స్ రాలేదు. ఆ డ్రగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వరలక్ష్మీ మేనేజర్ అంటూ వార్తలు వచ్చాయి. అని చెప్పింది.