స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ టీజర్ రెండు నెలల కిందటే రిలీజై 130 మిలియన్స్ కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. అతి తక్కువ టైమ్ లో వంద మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ కు కొన్ని కొత్త విజువల్స్ యాడ్ చేసి రిలీజ్ డేట్ మార్చి మళ్లీ ఇవాళ అప్ లోడ్ చేశారు. ఈ కొత్త టీజర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఈ కొత్త టీజర్ లో సలార్ ఆర్మీని చూపించారు. టీజర్ విజువల్ షేడ్ కూడా మారింది. సెప్టెంబర్ 28 రిలీజ్ డేట్ మార్చి డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు యాడ్ చేశారు. ఈ మార్పులతో వచ్చిన సలార్ టీజర్ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతోంది. హోంబలే ఫిలింస్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. తొలి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.