“గుంటూరు కారం” రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజుకు సరిగ్గా వంద రోజుల టైమ్ ఉంది. ఈ సందర్భాన్ని నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్ అనౌన్స్ చేస్తూ పోస్ట్ చేసింది. సూపర్ స్టార్ మాస్ స్ట్రైక్ మరో 100రోజుల్లో అంటూ హ్యాపీనెస్ షేర్ చేసింది.

ఇన్షియల్ గా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసింది గుంటూరు కారం మూవీ. కథ మార్చడం, షూటింగ్స్ పలుసార్లు డిలే అ‌వడం, హీరోయిన్ పూజా ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవడం ఇలాంటి వాటితో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల గుంటూరు కారం టీమ్ కంటిన్యూయస్ గా రెగ్యులర్ షూటింగ్ చేస్తోంది. ఈ నెలాఖరుకు టాకీ కంప్లీట్ అవుతుందని నిర్మాత వెల్లడించారు. అంటే షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లే. సంక్రాంతి జనవరి 12న ష్యూర్ గా రిలీజ్ చేస్తామని స్ట్రాంగ్ గా చెబుతున్నారు మూవీ టీమ్.

దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. జగపతి బాబు, రమ్య కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.