మెగాస్టార్ – బోయపాటి కాంబో కుదిరిందా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో మూవీ సెట్ అయ్యిందా..ఇప్పుడు ఇదే టాక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోయపాటితో చిరంజీవి మూవీకి టాక్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది. చిరంజీవికి సరికొత్త మాస్, యాక్షన్ కథను బోయపాటి రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మెగా ఫ్యామిలీ హీరోలతో బోయపాటి శ్రీనుకు మంచి రిలేషన్ ఉంది. అల్లు అర్జున్ హీరోగా ఆయన రూపొందించిన సరైనోడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినా అఖండ హిట్ తర్వాత బోయపాటితో సినిమా చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపించారు. ఇక ప్రస్తుతం వీరి కాంబోకు మూవ్ మెంట్ మొదలైందని టాక్.

చిరంజీవికి రెండు మూడు సినిమాల లైనప్ ఉంది. మెగా 156, మెగా 157 సినిమాలున్నాయి. వీటిలో మెగా 156 అటకెక్కినా, ఈ స్లాట్ లో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఆయనకు డైరెక్టర్ అనిల్ రావిపూడితోనూ ఒక మూవీ ఉంది. మెగా 158గా బోయపాటితో మెగాస్టార్ సినిమా ఉంటుందని అంటున్నారు.