ఈ సంక్రాంతికి విజయ్ దేవరకొండ వర్సెస్ నాగార్జున

ఈ సారి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ బాగా ఉండబోతోంది. సంక్రాంతి ఫెస్టివల్ జరిగే మూడు రోజులు థియేటర్స్ లోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటిలో నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామి రంగ, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వీడీ 13 సినిమాలు కూడా ఉన్నాయి. వీటి రిలీజ్ డేట్స్ పై వస్తున్న సమాచారం..ఈ జూనియర్, సీనియర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారని కన్ఫర్మ్ చేస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా జనవరి 14న రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిస్తున్న నా సామి రంగ సినిమా కూడా జనవరి 14నే రిలీజ్ అని తెలుస్తోంది. దీంతో ఈ పండుగకు విజయ్ దేవరకొండ, నాగార్జున సినిమాలు క్లాష్ తప్పదని స్పష్టమవుతోంది.