ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మ్యాడ్. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గౌపికా ఉద్యాన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కల్యాణ్ శంకర్ రూపొందించారు. వచ్చే శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మ్యాడ్ సినిమా ట్రైలర్ ను ఇవాళ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే జాతి రత్నాలు సినిమా క్యారెక్టర్స్ కాలేజ్ లోకి వచ్చి సందడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏసీలో నీళ్లు పోయలేదా చల్లగా రావడం లేదు అనడం, మెచ్యూర్డ్ గా ఆలోచించండి రా…చిట్టిలు వేద్దాం పట్టు, మా నాన్న డీసెంట్ జాబ్ చేస్తుంటాడు సార్..ఏం చేస్తాడంటే దొంగ సారా కాస్తాడు అనే డైలాగ్స్ మొత్తం జాతి రత్నాలు పంచ్ డైలాగ్స్ గుర్తు చేస్తున్నాయి.
జాతి రత్నాలు సినిమాకు దర్శకుడు కేవీ అనుదీప్ తో కలిసి రైటర్ గా పనిచేసిన కల్యాణ్ శంకర్..ఆ సినిమా ఫ్లేవర్ నే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మ్యాడ్ సినిమాలోకి తీసుకొచ్చినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అయితే ఇందులో కొంత అడల్ట్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ కూడా ఉంది. ట్రైలర్ తో మ్యాడ్ సినిమా యూత్ ఆడియెన్స ను టార్గెట్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది.