జాతీయ స్థాయి బాక్సర్ అయిన రితికా సింగ్..ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. సాలా ఖద్దూస్ సినిమాతో తమిళంలో సక్సెస్ అందుకున్న ఈ తార..తెలుగులో వెంకటేష్ తో గురు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన ఆఫర్ దక్కలేదు. ఇప్పుడు రజినీ 170 మూవీతో రితికాకు ఆమె ఇన్నాళ్లుగా ఎదురుచూసిన సినిమా ఖాతాలో పడింది.
రజినీకాంత్ హీరోగా దర్శకుడు టీజీ జ్ఞానవేల్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది రజినీకాంత్ నటిస్తున్న 170వ సినిమా. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మంజూ వారియర్, దుశారా విజయన్ తో పాటు రితికా సింగ్ హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. మూడు కీలక పాత్రల కోసం వీరిని తీసుకున్నట్లు తెలుస్తోంది.
తలైవర్ 170 అనౌన్స్ కాగానే అందులో తనకు అవకాశం దక్కిందని తెలిసి రితిక ఎమోషనల్ ట్వీట్ చేసింది. తాను రజినీతో కలిసి నటిస్తున్నానంటే నమ్మలేకపోతున్నా అంటూ తన సంతోషాన్ని వెల్లడించింది.