మహేశ్ బాబు, షారుఖ్ ఖాన్ మంచి ఫ్రెండ్స్. వీరి స్నేహానికి నమ్రత పరిచయాలు ఒక కారణం. ఈ మధ్య జవాన్ మూవీకి మహేశ్ ఇచ్చిన కాంప్లిమెంట్స్, అందుకు షారుఖ్ స్పందించిన విధానం వీరి మధ్య స్నేహాన్ని చూపిస్తోంది. ఈ ఫ్రెండ్షిప్ మరింత దగ్గర చేస్తూ మహేశ్ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట షారుఖ్. ఈ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మహేశ్ హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఓ కీలకమైన పాత్రకు షారుఖ్ ను గెస్ట్ రోల్ చేయమని సంప్రదిస్తున్నారట. మహేశ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కాబట్టి షారుఖ్ గెస్ట్ రోల్ చేస్తే నార్త్ లో ఈ సినిమా రీచ్ మరో రేంజ్ కు చేరుతుంది. షారుఖ్ ఇందుకు అంగీకరించాడా లేదా తెలియాల్సిఉంది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది గుంటూరు కారం సినిమా. వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో హిందీ సహా దక్షిణాది భాషలైన కన్నడ, తమిళ, మలయాళంలో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.